రేబిస్‌తో ఏటా 55వేల మంది మృతి

83చూసినవారు
రేబిస్‌తో ఏటా 55వేల మంది మృతి
కుక్క కాటుతో వ్యాపించే ప్రాణాంతక రేబీస్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టీకాలు, తగు చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయానికీ దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రేబిస్‌ కారణంగా ఏటా 55వేల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా. వీరిలో 36 శాతం మంది మనదేశానికి చెందినవారే. ప్రతి సంవత్సరం మనదగ్గర సుమారు 20వేల మంది రేబిస్‌తో చనిపోతున్నారు. రేబిస్‌ కేసులు, మరణాలను పరిశీలిస్తే 30 నుంచి 60శాతం మంది 15ఏళ్ల లోపు పిల్లలే కావటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్