నీట మునిగిన వందలాది ఇళ్లు (వీడియో)

78చూసినవారు
అమెరికాలోని ఐయోవా రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 4,200 మంది జీవించే రాక్‌వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక్కడ చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్లు, బోట్లతో తరలిస్తున్నారు. మరోవైపు సౌత్‌ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్