కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం (NPS) కింద ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంపికను అందించింది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వ ఉద్యోగులు NPS కింద UPS ఎంపికను ఎంచుకోవచ్చు లేదా UPS ఎంపిక లేకుండా NPSతో కొనసాగవచ్చు.