ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. 2014లో విభజన కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి శ్రద్ధ తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని లేఖలో కోరారు.