అప్పుల బాధతో కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యాయత్నం (వీడియో)

54చూసినవారు
అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. తాండూరు మండలం కాసిపేట్ కు చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులకు కుమార్తె చైతన్య, కుమారుడు శివప్రసాద్ ఉన్నారు. శివప్రసాద్ చిరుద్యోగం చేస్తున్నాడు. శివప్రసాద్ అప్పులు చేసి ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి
నష్టపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో అప్పుల భారం పెరగడంతో కుటుంబంలోని నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్