ఉత్తరప్రదేశ్‌లో ఓ భర్త తన భార్యకు ప్రియుడినిచ్చి రెండో పెళ్లి చేసిన విషయం తెలిసిందే. వారికున్న ఇద్దరు పిల్లలను కూడా తానే చూసుకుంటానని చెప్పాడు. అయితే, ప్రియుడు వికాస్‌తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ చెంతకు చేరింది. వికాస్ తల్లి బబ్లూ అనుభవించే బాధ గురించి తన కొడుక్కి అర్థమయ్యేలా చెప్పింది. దీంతో రాధికను బబ్లూ వద్దకు పంపాడు. బబ్లూ కూడా తన భార్యను స్వీకరిస్తానని పంచాయతీలో ఒప్పుకున్నాడు.