ఆటిజమ్ రకరకాల రూపాల్లో బయటపడుతుంది. కొందరికి చాలా తక్కువగా ఉండొచ్చు. సరిగా మాట్లాడకపోవటం, ప్రతిస్పందించకపోవటం, ఇతరులతో ఎక్కువగా కలవకపోవటం వంటి కొన్ని లక్షణాలుండొచ్చు గానీ తమ పనులు తాము చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలసి ఉంటారు. వీళ్లు దాదాపు మామూలు పిల్లల మాదిరిగానే కనిపిస్తారు. కానీ కొందరికి సమస్య తీవ్రంగా ఉండొచ్చు. దీంతో పాటు బుద్ధి మాంద్యమూ ఉండొచ్చు. కొందరికి ఫిట్స్ వంటి మెదడు సమస్యలూ వేధించొచ్చు.