చాలా మంది తల్లులు తమ పిల్లల్లో ఉన్న ఆటిజం సమస్యను గుర్తించడమే లేదు. బయటకు తెలిస్తే పరువుపోతుందని అనుకుంటున్నారు. అమ్మాయి/అబ్బాయిని ట్యూషన్‌కు లేదో మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్‌కి తీసుకెళుతున్నారు. టీనేజర్ స్థాయిలో ఉన్న పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచుతున్నారు. వారికి ఎలాంటి థెరపీ ఇవ్వకపోవడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. దీంతో అప్పుడు నిపుణులను కలుస్తున్నారు. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే, పరిష్కారం కూడా త్వరగా లభిస్తుంది.