TG: HCU భూముల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తాజాగా ఈ అంశంపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ' సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వయస్సు 44 ఏళ్లు. నేను రేపో మాపో చనిపోతాను. కానీ నా బిడ్డలతో పాటు చాలా మంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది. వాళ్లందరికీ ఆక్సీజన్, వాటర్ అవసరం. అందుకోసం HCUలోని ఈ 400 ఎకరాలను వదిలేయండి సర్' అంటూ రిక్వెస్ట్ చేశారు.