హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

66చూసినవారు
హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. నల్లగొండ, యాదాద్రి, సిద్దిపేట, సంగారెడ్డిలో కుండపోత వర్షం కురిసింది. అకాలవర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ధాన్యం తడిసింది. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. వేసవిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్