అంబర్ పేట్ లో నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రూ. 450 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాయి. పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే అధికారులు ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1.5 కిలోమీటర్లు ఉండే ఈ ఫ్లైఓవర్ నాలుగు లైన్లలో నిర్మించారు. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి.