నల్లకుంట స్ట్రీట్ నెంబర్ 14-15 ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ సమస్య ఎక్కువగా ఉంది. దీనిపై అన్లైన్లో అధికారులకు చాలా కంప్లైంట్స్ చేశామని కాలనీవాసులు మంగళవారం తెలిపారు. సమస్యను పరిష్కరించినట్లు మేసేజ్ వచ్చిన సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు రాలేదని కారణం చెబుతున్నారన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే స్పందించాలన్నారు.