హైదరాబాద్ లోని క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ కు ఉప్పల్ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేస్తున్నట్లు సోమవారం హెచ్పీఏ ప్రెసిడెంట్ జగన్ తెలిపారు. స్టేడియంలో నూతనంగా సీట్లను అమర్చుతున్నారు. వెస్ట్, ఈస్ట్ స్టాండ్ లాపై అభిమానుల సౌకర్యార్థం పందిరి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ నిర్వహణలో హైదరాబాద్ అత్యుత్తమ హోస్ట్ గా నిలుస్తుందని, ఇందుకు కృషి చేస్తామని జగన్ వెల్లడించారు.