హైదరాబాద్ గోల్నాక నుండి అంబర్‌పేట్ ఇరానీ హోటల్ వరకు 335 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారి భూసేకరణ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలాంబరీది మంగళవారం పరిశీలించారు. కోర్టు తీర్పు మేరకు పనులు వేగవంతం చేయాలని అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో జాతీయ రహదారుల శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.