పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

62చూసినవారు
సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి బాత్రూమ్ లో చొరబడి దుండగులు సైగలు చేసిన ఘటనపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. విసీ వచ్చి సెక్యూరిటీపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీకి చేరుకున్నారు. పట్టుబడ్డ ఓ నిందితుడిని పెట్రోలింగ్ వాహనంలో తీసుకెళ్తుండగా స్టూడెంట్స్ అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ తీసుకెళ్ళోద్దంటూ పట్టుబట్టారు.