జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరపున హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర నామినేషన్లు రాకపోవడంతో మహాలక్ష్మి రామన్ గౌడ్ ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా శనివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ఇతర కార్పొరేటర్లకు మహాలక్ష్మి రామన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.