కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ కు మతిమరుపు వచ్చినట్లుంది అని హరీష్ రావు బుధవారం తీవ్ర విమర్శలు చేసారు. షరతులు పెట్టి చాలామంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని విమర్శించారు. రైతు భరోసా విషయంలో పది ఎకరాలకే ఇస్తాం, ఒక్క పంటకే ఇస్తాం అని ప్రభుత్వం లీకులు చేస్తోందని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేస్తే రైతు లోకం తిరగబడుతుందని హరీష్ హెచ్చరించారు.