తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో మంగళవారం కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి పండుగ సంబరాలను జరుపుకున్నారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి వేడుకల్లో పాలుపంచుకున్నారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు.