విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు

74చూసినవారు
మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రాజ్యాంగ విలువలను, ప్రజాసౌమ్య విలువలను కాపాడుటకై ఉద్యమించాలని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పూలే 197వ జయంతి సందర్భంగా ఓయూలోని అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి విద్యార్థి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లి సత్య, నామ సైదులు, దివాకర్, వికాస్ యాదవ్, అజయ్, సాయి భగత్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.