రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ మున్సిపల్ పరిధిలో జరిగింది. బహదూర్‌పురాకు చెందిన కె.కుమార్(40) తన కుమార్తె శాంతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తొండుపల్లి రైల్వే పైవంతెన వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దింతో ఎగిరి రోడ్డు పై పడ్డ కుమార్ తల మీదుగా వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.