భారీ వర్షాలు.. అల్పపీడనం ఏర్పడే అవకాశం
బహదూర్ పురలో వాతావరణం చల్లబడింది. గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతంగా మారింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. దీని ప్రభావంతో వచ్చే ఐదురోజుల పాటు కుండపోతగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.