వాటర్ పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కిషన్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ హుస్సేని పాషా అన్నారు. శనివారం డివిజన్ పరిధి వాటర్ పొల్యూషన్ ఉన్న ప్రాంతాలలో కార్పొరేటర్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, త్వరగా సమస్యలను పరిష్కరించేలా చూస్తామని కార్పొరేటర్ స్థానికులకు హామీ ఇచ్చారు.