మీర్‌పేట పీఎస్ పరిధిలోని జిల్లెలగూడలో జరిగిన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన సంగతి తెలిసిందే. గురువారం ఫొరెన్సిక్ బృందం ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. నిందితుడి భార్యను హత్య చేయడానికి ముందు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో కాలనీలోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు.