చాంద్రాయణగుట్ట: రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్
బార్కస్ పరిధిలోని రహ్మత్ అలం కాలనీలో బార్కస్ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ హఫీజ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బార్కస్ డివిజన్ అభివృద్ది కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.