అసెంబ్లీ సేషన్స్ నడుస్తున్న తీరుపై ఎంఐఎం పక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గురువారం అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అయన మాట్లాడుతూ. ఈ అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు నడుపుతారో తెలీదు. ఏ బిల్లు ఏ రోజు చర్చకు వస్తుందో తెలీదు? శాసనసభను అడ్డగోలుగా నడుపుతున్నారు అంటూ ద్వజమెత్తారు. సరైన విధంగా సభను నడపడం లేదని ఫైర్ అయ్యారు.