శని దేవుడికి ప్రత్యేక పూజలు

52చూసినవారు
శని దేవుడికి ప్రత్యేక పూజలు
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం, ఉప్పుగూడ రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణంలో గల నవగ్రహ దేవతా ఆలయంలో శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శని దోషం ఉన్నవారు శని దేవుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేశారు. నల్లటి వస్త్రాన్ని కప్పారు. పుష్పాలతో అలంకరించారు. దీప ధూపాలను వెలిగించారు. నల్ల నువ్వులను, అరటి పండ్లను మరియు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించారు. టెంకాయలను కొట్టారు. నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్