AP: ఉగాది సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాల టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’, నార్నె నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరపై రూ.75 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. పెరిగిన ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయి.