గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గోషామహల్ లోని ఇసమీయ బజార్ లో శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిలీప్ గనాటి ఆధ్వర్యంలో ఈ పూజ నిర్వహించారు. ఇలాంటి పూజలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని డిప్యూటీ మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.