ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ గ్రౌండ్ కు తరలించద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం అసెంబ్లీలో సీఎంను కోరారు. అఫ్జల్ గంజ్ ఉస్మానియా ఆసుపత్రి వెనకాలే నూతన ఆసుపత్రి నిర్మాణానికి కావాల్సినంత స్థలం ఉందని తెలిపారు. హైదరాబాద్ విధాన సభ అసెంబ్లీ పరిధిలో ఏకైక గ్రౌండ్లో ఆసుపత్రి నిర్మిస్తే ట్రాపిక్ సహా అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. దీంతో పాటు ఉన్న ఒకే ఒక గ్రౌండ్ లేకుండా పోతుందన్నారు.