ఇబ్రహీంపట్నం: మైనర్ బాలిక అదృశ్యం

50చూసినవారు
ఇబ్రహీంపట్నం: మైనర్ బాలిక అదృశ్యం
పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ శాంతినగర్ లో నివసించే ఓ మైనర్ బాలిక అదృశ్యమైంది. బుధవారం కుటుంబ సభ్యులు వారివారి పనులపై బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి రాగా బాలిక కనిపించలేదు. ఆందోళనకు గురై, స్నేహితులు, బంధువులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గురువారం సాయంత్రం తల్లి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్