బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పద్మశ్రీ కిదాంబీ శ్రీకాంత్ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పెళ్లి చేసుకోనున్న శ్రీకాంత్ తన వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.