బంజారాహిల్స్ లేబుల్స్ లో ఏర్పాటు చేసిన అనంకార లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే ను పురస్కరించుకొని శుక్రవారం పలువురు డిజైనర్స్ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. సాంప్రదాయ, ఆధునిక మేళవింపుతో కూడిన దుస్తులు, ఆభరణాల ప్రదర్శనను మోడల్స్ ప్రారంభించారు. తమను ఇష్టపడే వారికి, తాము ఇష్టపడే వారికి అద్భుతమైన బహుమతులు అందించాలనుకునే వారి కోసమే వాలెంటైన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేసారు.