తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. "స్ట్రెచర్, మార్చురీ" వ్యాఖ్యలు కేసీఆర్ ప్రాణాలకు ముప్పుగా మారేలా ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శ్రవణ్, రేవంత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.