తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిర్మాత దిల్ రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. తనకీ ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికై ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీకి వారధిలా ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పని చేస్తుందన్నారు.