మాజీ సిఎం రోశయ్య మాకు స్పూర్తీ: సీఎం రేవంత్

85చూసినవారు
శాసనసభ మండలిలో మాట్లాడేటపుడు మాజీ సిఎం రోశయ్య తమకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మాజీ సీఎం రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. రోశయ్య ఆర్థిక క్రమశిక్షణ వల్లే తెలంగాణ రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. 16 సార్లు రోశయ్య ఆర్థిక మంత్రిగా పని చేసినందుకే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్