జూబ్లీహిల్స్: ఫిలింనగర్లో సీఎం రేవంత్ రెడ్డిపై పిర్యాదు

67చూసినవారు
కేసీఆర్ పై రవీంద్రభారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ శుక్రవారం ఫిలింనగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసీఆర్ స్ట్రేచర్ పై ఉన్నారని అటు నుంచి అటే పోతారని వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తికి సీఎం పదవిలో ఉండే అర్హత లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను దూషించడం తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకిస్తోందని, రేవంత్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్