న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. 31 స్ట్ నైట్ ఈవెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు వినియోగించవద్దని హెచ్చరిస్తున్నారు. ఓయో హోటల్స్, ఫాంహౌజ్లలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. న్యూ ఇయర్ పేరిట ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు.