ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రామానాయుడు కథనం ప్రకారం.. కమలపూరి కాలనీలో నివసించే జయేష్ కనోడియా(17) ఓ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17న కంటి
పరీక్షలు చేయించుకుంటానని ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.