తెలంగాణలో సమగ్ర కుల సర్వే నిర్వహణపై అఖిల భారత యాదవ మహాసభ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ సుభాష్ చంద్ర యాదవ్, యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, తదితరులు సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఓబీసీ సాధికారతకు రోల్ మోడల్ గా నిలుస్తుందని అరుణ్ సుభాష్ చంద్ర యాదవ్ ప్రశంసించారు.