సికింద్రాబాద్, న్యూ బోయిన్ పల్లిలోని నాలా చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండి నాలా విస్తీర్ణం తగ్గిపోయిందని బుధవారం స్థానికులు చెబుతున్నారు. రోగాలను వ్యాపింపజేసే గబ్బిలాలకు నిలయంగా మారింది. అధికారులకు పలుసార్లు చెప్పినప్పటికీ కంటోన్మెంట్ అధికారులు గత 2 ఏళ్లుగా ఈ నాలా శుభ్రంచేయడం లేదని దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు.