కార్వాన్ డివిజన్ పరిధిలోని దరియా బాగ్ లో అధికారులతో కలిసి కార్పొరేటర్ స్వామి యాదవ్ గురువారం పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న డ్రైనేజీ మరమ్మత్తు పనులను పరిశీలించారు. తరచూ ఓవర్ స్లో సమస్యలు రావడంతో మరమ్మత్తులు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు. సమస్యను గుర్తించి త్వరగా మరమ్మత్తులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు.