లాంగర్ హౌస్ డివిజన్ పరిధిలో దశలవారీగా అభివృద్ది పనులను చేపడుతున్నామని కార్పొరేటర్ వజీ ఉజ్జమా అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని చోట బజార్లో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులకు ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తవ్వలన్నారు.