అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందేలా చూస్తామని కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న అధికారులతో కార్పొరేటర్ మాట్లాడారు. లబ్ధిదారుల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు.