ఫుట్ పాత్ లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద పలువురు నేతలకు సంభందించిన బ్యానర్ లతో పూట్ పాత్ ను ఆక్రమించి పెట్టేశారు. దీంతో వాహనదారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. ఏదైనా అనుకొని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.