తెలంగాణ డీజీపీ జితేందర్ ని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి గురువారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న నేపథ్యంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్ డిజేపీని కలిసి వినతిపత్రం అందజేశారు.