సచివాలయంలో శుక్రవారం అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆఫీస్ కన్పరెన్స్ హాలులో టైగర్ రిజర్వ్డ్ గవర్నింగ్ బాడీస్ చైర్ పర్సన్, మంత్రి కొండా సురేఖ అధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్డ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ గవర్నింగ్ బాడీస్ పై చర్చించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్. ఎం. డోబ్రియల్ ( వైల్డ్ లైఫ్), ఏలూ సింగ్, ఆంజనేయులు, సిఎస్ రాంబాబు పాల్గొన్నారు.