పంజాగుట్ట ట్రాపిక్ పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. డ్రైనేజీ నీరు రోడ్డుపై భారీగా పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన సైతం వస్తోంది. వెంటనే సంబంధిత సిబ్బంది సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. డ్రైనేజీ మురుగు నీటి వల్ల పూట్ పాత్ పైకి ఎక్కి నడిచేందుకు కూడా వీలు లేకుండా పోతుందని పాదచారులు వాపోతున్నారు.