హైడ్రా కూల్చివేతలపై నిజనిర్దారణ కమిటీ వేయాలని సీఎంను కోరుతామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కాస్త ముందే మెల్కోంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదని.. మూసిలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా కేటీఆర్ చెప్పలేదా అని అన్నారు. అక్రమకట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా. అక్రమ కట్పడాలకు బిఆర్ఎస్ హాయాంలో విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారన్నారు.