కూకట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్(30) విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రంగదాముని చెరువు వద్ద కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతుడు జగద్గిరిగుట్ట సోమయ్య నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.