కూకట్ పల్లి నియోజకవర్గం కె. పి. హెచ్. బి పోలీస్ స్టేషన్ పరిధిల అడ్డగుట్టలోని ఓ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్లో వైద్యం వికటించి బుధవారం వెంకటేశ్వర్లు(54) అనే వ్యక్తి మృతి చెందాడు. 3వ తేదీన సాయంత్రం రీహాబిలిటేషన్ కేంద్రంలో వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం చేర్పించారని అతని బంధువులు చెప్పుకొచ్చారు. రాత్రి వైద్యులు ఓవర్ డోస్ ఇంజక్షన్ చేయటంతో మృతి చెందాడని ఆరోపించారు. బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.